telugu navyamedia
క్రీడలు వార్తలు

కివీస్ బలహీనతలు నాకు తెలుసు : రోహిత్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వీళ్లతో(కివీస్ బౌలర్లు) ఆడాను. వాళ్ల బలం, బలహీనతలు నాకు తెలుసు. ఇక్కడి కండీషన్స్, టీమ్ సిచ్యువేషన్, మేం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నామా, సెకండ్ చేస్తున్నామా అన్న దానిపై సంబంధం లేకుండా వాళ్ల నుంచి సవాల్ ఉంటుంది. అయితే దీని గురించి మేం అతిగా ఆలోచించకూడదు. ఓ బలమైన జట్టుతో పోటీ పడుతున్నప్పుడు అన్ని విషయాలను సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం’అని రోహిత్ పేర్కొన్నాడు. షార్ట్ ఫార్మాట్‌లో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హిట్ మ్యాన్.. ప్రతీ రోజు సవాల్ విసిరే లాంగ్ ఫార్మాట్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ‘ఈ ఫార్మాట్‌లో మనకు ఐదు రోజులూ చాలెంజ్ ఎదురవుతుంది. నాకు తెలిసి మరెక్కడా ఇలా ఉండదు. ప్రతి రోజు ఓ కొత్త సవాల్ వస్తుంది. లాంగ్ ఫార్మాట్‌లో ఓపిక అవసరం. అలాగే డిఫరెంట్ కండీషన్స్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇదంతా అంత ఈజీకాదు. ఫీల్డ్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఐదో రోజులు మెంటల్‌గా ఫ్రెష్‌గా ఉండాలి. అలాగే, ఈ సవాళ్లను అంగీకరించి, వాటిని అధిగమించడానికి ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలి’అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Related posts