telugu navyamedia
తెలంగాణ వార్తలు

కర్నాటక బస్సు ప్రమాద మృతులకు కేసీఆర్‌ 3లక్షల పరిహారం ..

కర్నాటక కాల్‌బుర్గీలో బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒక్కో క్షతగాత్రుడికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

గాయపడిన వారికి సైతం కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఆదేశించారు.

గోవా నుండి హైద‌రాబాద్‌ కు వస్తున్న ప్ర‌వేట్‌ బస్సు కలబురిగి జిల్లా కమలాపురా పట్టణ శివార్లలో టెంపోను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు డీజిల్ ట్యాంకర్‌ లీకవడంతో మంటలు అంటుకొని క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత గమనించిన ప్రయాణికులు కొందరు కిటికీలు, డోర్లు తెరుచుకొని కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అందులో కొందరు తప్పించుకునే క్రమంలోనే మంటల్లో కాలిపోయారు.

బస్సు గోవా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురిగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 12 మందిని రక్షించారు. ఈ ఘటనలో చ‌నిపోయివారంతా హైద‌రాబాద్ కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 35 మంది ఉన్నారు .హైద‌రాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్ తన కూతురు బర్త్ డే వేడుకలకు గాను బంధువులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో మరణించిన వారిని అర్జున్, సరళ, శివకుమార్, రవళి, దీక్షిత్,అర్జున్, అనితతో మరొకరు మరణించారు. బస్సులోని 35 మందిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 25 మంది ఉన్నారు

Related posts