telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు

రేపు తెలంగాణ 10వ తరగతి ఫలితాలు.

రేపు తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆన్‌లైన్‌లో అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.

పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

వీరిలో 2,50,433 మంది బాలికలు.. 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది.

పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Related posts