తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు వెళ్లనున్నారు.
రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు.
ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవనున్నారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంది.


ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్