telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Telangana assembly hyd

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఏర్పాట్లను స్వయంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఉదయం ప్రశాంతంగా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే..మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి సవరణ బిల్లుపై మాట్లాడారు. 1955 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని..ఉమ్మడి ఏపీలో తెచ్చుకున్న చట్టం ఇంకా ఉందని తెలిపారు.

జీహెచ్ఎంసీకి కొత్త చట్టం తేవాలని గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని..జీహెచ్ఎంసీ చట్టంకి 5 సవరణలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళ సాధికారిత కోసం 50 శాతం రిజర్వేషన్లు…స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కలిపించిన రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. జీహెచ్ ఎంసీ లో ప్రతి డివిజన్ లో నాలుగు రకాల కమిటీలు ఏర్పాటు చేస్తాం…25 మందితో కమిటీలు వేశామని పేర్కొన్నారు. చివరికి ఇండియన్ స్టాంప్ బిల్, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ బిల్, జిహెచ్ఎంసి సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది.

Related posts