telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పారదర్శకమైన పురపాలన అందించేందుకు మార్పులు: కేటీఆర్‌

KTR TRS Telangana

పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా నూతన జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమవుతుందన్నారు.

కొత్త మున్సిపల్‌ చట్టంలోని కీలక అంశాలను జీహెచ్‌ఎంసీ నూతన చట్టంలో పొందుపరుస్తున్నామని తెలిపారు. నిర్మాణ అనుమతులు, శానిటేషన్‌, గ్రీనరీ అంశాలకు ప్రాధాన్యం. పౌరులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివర్ఞ్చారు. టీఎస్‌ బీపాస్‌ విధానానికి అవసరమైన చర్యలు చేపడుతామన్నారు. హెచ్‌ఎండీఏ అనుమతుల్లోనూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ వెల్లడించారు.

Related posts