తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇవాళ జరగనుంది. దీంతో ఈ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు నిన్న పరిశీలించారు. ఇక ఇవాళ జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు చట్ట సవరణ బిల్స్ ని ఆమోదించనున్నారు. ఆ బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి.
నాలా (NALA) చట్టానికి సవరణ: వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేస్తూ.. చట్ట సవరణ బిల్.
రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు చేస్తూ బిల్ :
జిహెచ్ఎంసీ చట్టం – 1955.. సవరణ : జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ… వార్డు కమిటీల పనివిధానానికి సంబంధించి.. వార్డుల రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో.. చట్ట సవరణలు….
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సవరణలు : నిందితుడు కోర్ట్ కి సక్రమంగా హాజరు కాకపోతే సూరిటీ లకు ఫైన్ వేసే విదంగా చట్ట సవరణ.
previous post


మారని బంగ్లా ఆటగాళ్ల తీరు…