telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు

పార్లమెంటరీ సమావేశం ప్రారంభం – రాష్ట్ర ప్రయోజనాలపై కీలక చర్చలు చంద్రబాబు నేతృత్వంలో

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించనున్నారు. తొమ్మిది ప్రధాన అంశాలే అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.

తొక్కిసలాటలు – గుంపుల నియంత్రణలో నిర్వహణ లోపాలు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.

రాష్ట్రానికి ఏరోస్పేష్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఇబ్బందులు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల అంశంపై పార్లమెంటరీ పార్టీ చర్చించనుంది.

అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు, అమరావతి అభివృద్ధికి కేంద్రం చర్యలు, మామిడి ధర తగ్గిపోవటం వల్ల రైతు నష్టాలపై పార్లమెంట్‌లో లేవనెత్తే ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పలువురు లోక్‌సభ, రాజసభ సభ్యులు హాజరయ్యారు.

Related posts