పార్టీలో అందరూ పాటుపడాలని తెలుగు దేశం పార్టీ నేత కేశినేని నాని అన్నారు. పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదని నాని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని నిర్మాణం జరగాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మన కలలను మనమే సాకారం చేసుకోవాలని, పార్టీలో అందరూ పాటుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
మన కలలను మనమే సాకారం చేసుకోవాలి. మన కలలను ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలని అన్నారు.
సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…