ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు జవహర్ మండిపడ్డారు.. నిన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని చంద్రబాబుపై చేసిన విమర్శల పై జవహర్ స్పందించారు. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడడం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
తమ్మినేని తన ఉనికిని చాటుకునేందుకు బాధ్యతగల తన హోదాను సీఎం జగన్‌కు తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఆయనకు అంతగా మోజు ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని జవహర్ హితవు పలికారు. జగన్ వద్ద మెప్పుపొందేందుకు నిరాధారమైన ఆరోపణలు చంద్రబాబు కుటుంబంపై చేయడం సరికాదని పేర్కొన్నారు.
వంశీ చెబుతున్న వెబ్సైట్లతో నాకు సంబంధం లేదు: లోకేశ్