ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని సీఎం జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో కొనసాగిన జగన్ ఏడు నెలల పాలన చెట్టు కింద చేశారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ లో కూర్చుని పని చేయలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, వరదలు వస్తే రాజధాని ప్రాంతం మునిగిపోతుందని గ్రీన్ టైబ్ర్యునల్ చెప్పిందని, రాజధానిలో నిర్మాణాలకు పునాదులు వేసేందుకే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని జగన్ నిన్నటి వరకు చేసిన ఆరోపణలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతిలో ఒకే సామాజిక వర్గం ఉందన్న వైసీపీ నేతలు, ఈరోజున ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని రాజధాని నిర్మాణం సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. వేరే ప్రాంతానికి వెళితే హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీలు నిర్మించాలంటే డబ్బులు కావలికదా.. మరి, డబ్బులు లేవని ప్రభుత్వం చెప్పడం ఓ నెపం మాత్రమేనని దుయ్యబట్టారు.


ఆత్మలు ఘోషిస్తున్నాయి.. కేసీఆర్ కు ఉసురు తగులుతుంది