సోమవారం అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీగా తరలి వెళతామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. బుల్లెట్లకు ఎదురొడ్డి.. ప్రాణాలైనా త్యాగం చేస్తామని అన్నారు. తమ శవాల మీద నుంచి వెళ్లి బిల్లు పాస్ చేసుకోవాలని చెప్పారు.
అసెంబ్లీ ముట్టడిని సీఎం జగన్మోహన్ రెడ్డి తాత కూడా ఆపలేరని, ఇది ప్రజా ఉద్యమమని అన్నారు. పోలీసుల ప్రవర్తన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు పేరు వస్తుందని రాజధాని మార్చడం తగదని అన్నారు. వైసీపీకి ఓట్లేసిన ప్రజల నోట్లో జగన్ మట్టికొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదే: మంత్రి తలసాని