telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నేత అనితను అడ్డుకున్న పోలీసులు

tdp ex mla anitha

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనితను పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పార్టీ అభ్యర్థుల తరపున నామినేషన్ కార్యక్రమానికి అనిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్టణం జిల్లాపరిషత్ కార్యాలయంలోని వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అమర్ ను మాత్రం వారు లోపలికి అనుమతించారు. దీంతో, పోలీసుల తీరుపై అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఒక న్యాయం, అధికార పార్టీ నేతలకు మరో న్యాయమా? అని ఆమె మండిపడ్డారు.

Related posts