మరికొన్ని గంటల్లో పెళ్లి ముహూర్తం.. ఇప్పుడే వస్తానని బయటకెళ్లిన వరుడు తిరిగిరాకపోవడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మీనంబాక్కంకు చెందిన సుకుమారన్ (34) చెన్నై విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. స్థానిక రాయపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నిన్న ఉదయం పల్లవరంలోని కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి.
ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు సోమవారం సాయంత్రమే కల్యాణ మండపానికి చేరుకున్నారు. బయట చిన్న పని ఉందని, చూసుకుని ఇప్పుడే వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన సుకుమారన్ గంటలు గడుస్తున్నా రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండడంతో అతడి కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కొడుకు కోసం గాలిస్తున్నారు.
ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ