లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కేరళకు చెందిన ఆరతి అనే యువతి ప్రపంచ రికార్డు సృష్టించింది. 90 రోజుల్లో ఏకంగా 350 కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కొచ్చిలోని ఎలమక్కరకు చెందిన ఆరతి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆరతి ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు అందించే ఆన్‌లైన్ కోర్సుల గురించి తెలుసుకుంది.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ, వర్జీనియా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే 350 కోర్సులలో ఆమె అడ్మిషన్ తీసుకుంది. అనంతరం 90 రోజుల్లోనే వాటిని పూర్తిచేసి యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో స్థానం సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు