గౌతమ్ తిన్ననూరి సినిమాకు దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాని 35వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి “స్పిరిట్ అఫ్ జెర్సీ…” అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
ఈ సినిమాతో పాటు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నాని నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రానికి “గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను ఖరారు చేసి ప్రకటించారు.