telugu navyamedia
సినిమా వార్తలు

చిరు అభిమానులకు శుభవార్త.. ఆచార్య రిలీజ్ ఎప్పుడంటే..?

మెగా అభిమానులకు పండుగలాంటి వార్త. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. టాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకులను కనువిందుచేయబోతుంది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికే పలు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ముందుగా దసరాకి వస్తుందని వినిపించినా ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు పుకార్లకు తెర పడింది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. దాంతో చాలా సినిమాలు తమ విడుదల తేదీలు ప్రకటించాయి. దసరా, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ఇప్పటికే బుక్కైపోయాయి. ఇప్పుడు ఆచార్య కూడా తాను 2022 ఫిబ్రవరి 4న వస్తున్నాను అని చెప్పేసాడు. ఆచార్య చిత్రంలో చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

Related posts