telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శాటిలైట్‌ శంకర్‌” ట్రైల‌ర్

Satellite-Shankar

ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటుడు సూరజ్‌ పంచోలి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం “శాటిలైట్‌ శంకర్‌”. ఈ సినిమాని న‌వంబ‌ర్ 15న‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సూరజ్ సరసన మేఘా ఆకాష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సూరజ్‌ సైనికుడిగా నటిస్తున్నారు. దేశ భక్తి ప్రధానంగా ఓ సైనికుడు చేసే సాహసోపేతమైన జర్నీ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ జర్నీ చేసే క్రమంలో అసలు వాస్తవాలను తానెలా తెలుసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంద‌ట‌. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సైనికుడిగా సూర‌జ్ అద‌రగొట్టాడు. మేఘ ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించింది. చిత్ర ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts