telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక సింగ్ సుశాంత్ పట్ల ప్రవర్తించే తీరుపై అతడు భాధ పడేవాడని తెలిపింది. ఈ మేరకు తనతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను రియా షేర్ చేసింది. ఆ వాట్సాప్‌ చాట్‌ చూస్తే సుశాంత్ కలత చెందాడని అర్థమవుతుందని రియా చెప్పారు. అంతేకాకుండా తమ మధ్య దూరం పెంచడానికి సుశాంత్‌ రూమ్మేట్‌ సిద్ధార్ధ్‌ ని ప్రియాంక ప్రేరేపించేదని వాట్సాప్‌ మెసేజ్‌లలో రియాతో సుశాంత్‌ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్‌షాట్లను చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా రియా చేస్తున్న ఆరోపణలను సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్‌ తోసిపుచ్చింది. సుశాంత్ తనతో కూడా సరదాగా ఉండేవాడని, ప్రియాంకతో కూడా అలాగే ఉండేవాడని తెలిపింది. ప్రియాంక, సుశాంత్ లు సరదాగా ఉండేవారని సుశాంత్ ఒక ఇంటర్వ్యూ లో తన సోదరి గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.

Related posts