telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నెట్టింట వైరల్ అవుతున్న పాము.. అసలు నిజం ఏంటో తేల్చలేకపోతున్న నెటిజన్లు

snake

ట్విట్టర్‌లో పాము ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం ఆ పాము మింగిన వస్తువు. సాధారణంగా చిన్న పాములు వాటి కంటే చిన్నవైన జీవులను స్వాహా చేయడం.. అలాగే పెద్ద పాములు పెద్ద జీవులను సైతం మింగేందుకు ప్రయత్నించడం మనం ఇప్పుడు వరకు చూసి ఉంటాం. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో మాత్రం దీనికి భిన్నంగా పాము ఏకంగా ఏకే-47 తుపాకీనే మింగేయడం చూడొచ్చు. దీంతో ఈ ఫొటో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. @paeh_judin అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను షేర్ చేశాడు. అంతే.. అతను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 13వేల రిట్వీట్స్, 11వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను చాలా కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇది నిజమైనదేనా? లేక ఫొటోషాపులో ఎడిట్ చేసి పెట్టిందా? అని తేల్చుకోలేకపోతున్నారు.

Related posts