పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ సిద్దమవుతోంది. మరో ఏడాదిలోగా ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు ఓ వైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యూహం రచిస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన ఊపుతో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు.
పార్టీకి క్యాడర్ లేకున్నా పశ్చిమబెంగాల్ ఎన్నికల బరిలో నిల్చునేందుకు ఎంఐఎం పార్టీ కూడా పోటీకి సిద్ధమవుతోంది. “మాకు ఆ రాష్ట్రంలో కేడర్ లేదు. అయినా భయం లేదు. మమతా బెనర్జీ మమ్మల్ని మిత్రులుగా భావించినా, శత్రువులుగా భావించినా పోటీ చేయడం మాత్రం ఖాయం” అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి