telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టులో ఆరుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ హై కోర్టుకు కొత్తగా నియమితులైన ఆరుగురు జడ్జీలు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణు గోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావుఅదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.ఈ సంద‌ర్భంగా నూతన న్యాయమూర్తులకు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభినందనలు తెలిపారు.

 కాగా,  సీజేఐగా  జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 పెంచారు.

గత సంవత్సర కాలంలో 24 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. తాజాగా ఆమోదం పొందిన వారితో కలిసి రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

Related posts