telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోదావరి నీటిమట్టం పై కేసీఆర్ ఆరా.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

KCR cm telangana

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన 150 కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉండటాన్ని ఎరియల్ వ్యూ ద్వారా సీఎం చూశారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై కాలినడకన తిరిగి పరిశీలించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీగా నీరు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తయినందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ సీజన్‌లో మేడిగడ్డ నుంచి కిందకు ఎంత వరద వెళ్లిందని సీఎం ఆరా తీశారు. 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని అధికారులు వివరించారు. పై నుంచి వచ్చిన వరదకు అనుగూణంగా గేట్లు ఎత్తాలని వీలైనంత వరకు నదిలో నీటిమట్టం ఉంచాలని అధికారులుకు సీఎం ఆదేశించారు. గోదావరిలో మొత్తం వరద తగ్గిన తరువాతనే గేట్లు మూసివేయాలని తెలిపారు.

Related posts