ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరి పాట విడుదలైంది. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రారంభమైన ఆయన సినీ పాటల ప్రయాణం..‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా, సాయిపల్లవి, హీరోయిన్‌గా జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ .నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత.
‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఆకట్టుకుంటుంది. ఈ అద్భుతమైన మెలోడీకి మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
సల్మాన్ “పేపర్ టైగర్”… సింగర్ సంచలన వ్యాఖ్యలు