telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్‌డౌన్‌ వల్ల కుటుంబం బాధ్యత సీరియస్‌గా తీసుకోవడం అలవాటైంది : జాన్వీకపూర్

Jhanvi-Kapoor

శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్ “దఢక్”‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ఈ అయితే లాక్‌డౌన్‌ విరామ సమయంలో ఆమె ముంబయిలో తండ్రి బోనీకపూర్‌, సోదరి ఖుషీతో కలిసి గడుపుతోంది. జాన్వీకపూర్‌ మాట్లాడుతూ “గత రెండేళ్ల నుంచి ఇన్ని రోజుల విరామం ఎప్పుడూ దొరకలేదు. నాన్న, సోదరి యోగక్షేమాలు దగ్గరుండి చూసుకునే అవకాశం దక్కింది. స్వతహాగా నాది చిన్నపిల్లల మనస్తత్వం. ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు నాన్న ఎలాంటి భోజనం తీసుకుంటున్నారు? ఖుషీ తన టైమ్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటోంది? ఇంట్లో పనివాళ్లు శుభ్రత పాటిస్తూ కరోనా సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నా. ఈ లాక్‌డౌన్‌ వల్ల కుటుంబ సభ్యుల బాధ్యతగా మరింత సీరియస్‌గా తీసుకోవడం అలవాటైంది. ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే నాన్న, చెల్లి ఎంతలా కష్టపడేవారోనని తలచుకుంటే భయమేసింది” అని చెప్పింది జాన్వీకపూర్‌.

Related posts