telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ కి సేవలు అందించే సత్త ఎవరికీ లేదు..

‘మా’ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకు ఏకపక్షంగా సాగిపోతున్న మా ఎన్నికల ప్రమోషన్స్ లో మంచు విష్ణు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్యానల్ ప్రకటన, వరుస ప్రెస్ మీట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మీటింగ్స్ ఇలా దూకుడుగా ముందుకెళ్తున్న ప్రకాష్ రాజ్ కు షాక్ ఇస్తూ తన టీమ్‌ను పరిచయం చేసి, మేనిఫోస్టో ప్రకటించారు మంచు విష్ణు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అక్టోబర్‌ 10న జరుగనున్న (మా) ఎన్నికల కోసం అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు 26 మందితో కూడిన‌ తన ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశారు. ‘మా’లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌ కలిపిస్తామని పలు హామీలు ఇస్తూనే.. ప్రకాష్ రాజ్ పై పదునైన విమర్శలు చేశాడు. అవతలి వైపువాళ్ళు మంచి నటులు అంటూనే.. ‘మా’ కి సేవలు అందించే సత్త ఎవరికీ లేదని ప్రకాష్ రాజ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేశాడు. రెస్టారెంట్స్ లో డిస్కౌంట్స్ ఏంటి అసలు.. అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన హామీలను విమర్శిస్తూ పరువు తీసాడు మంచువిష్ణు.

Manchu Vishnu's MAA Elections Panel Press Meet - Gallery - Social News XYZ

మా’ ఎన్నికల్లో ఇంత పోటీ ఎప్పుడూ చూడలేదని, ‘మా’ మెంబర్స్ గ్రూపులుగా విడిపోయారని , ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం దారుణమ‌ని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంపై మా నాన్నగారు కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని, ఎన్నికల గురిం‍చి మీడియా, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇక తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు.

అందుకే నేను ఏకగ్రీవం కోసం చాల ప్రయత్నించా.. కానీ పోటీకి దిగక తప్పటం లేదు. అప్పట్లోనే దాసరి గారు, మురళి మోహన్ గారు కూర్చుని నన్ను ప్రెసిడెంట్‌గా చేయమన్నారు. కానీ నాన్నగారు వద్దు అంటే నేను డ్రాప్ అయిపోయాను. ఇక ప్రస్తుతం తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్న. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యం. మా బిల్డింగ్ తన సొంత డబ్బులతో కడతాను. ఇప్పటికే మాట ఇచ్చాను, కానీ అందులో పెళ్లిళ్లు జరగవు. సినిమాలు ఆడవు. షాపింగ్ మాల్స్ కట్టను. కేవలం ఆ బిల్డింగ్ సీనియర్స్ కి ఎలాంటి సహాయం చేస్తుందో మాత్రమే ఆలోచిస్తా. తాను పదవి లో ఉన్నా లేకపోయినా సినిమా ఇండస్ట్రీ కోసం చివరి శ్వాస వరకు పని చేస్తానని స్పష్టం చేశారు.

కానీ కొందరు అవతలి వైపు వారు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించరించాలంటే ఎనర్జీతో పని చేయాలి. నేను చేస్తాను. అవతలివైపు వారు చేయగలరా.. ఆ ప్యానెల్‌లో ఎంతో మంది గొప్ప నటులున్నారు. నిర్మాతగా నా వద్ద ఎంతో మందిని పెట్టుకున్నాను. కానీ మా అసోసియేషన్‌కు మాత్రం వాళ్లు ఎలాంటి సేవ చేయలేరు. అది నాకు తెలుసు. ఇండస్ట్రీ వాళ్లకు తెలుసు.

గత 14 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఓటేయడానికి వచ్చారా? మీ కోసం 900మంది వచ్చి ఓటెందుకు వేయాలి? అగ్ర హీరోలు, మహానటుల వల్ల ‘మా’ ముందుకు కదులుతోంది. అలాంటిది వారందరినీ ముందుకునెట్టి పనిచేయిస్తాననడం ఎంతవరకు సమంజసం. ఒక వర్కింగ్‌ ప్యానెల్‌ ఉండగా, అందులోని సభ్యుల కాలపరిమితి అవ్వకుండానే మీ ప్యానల్‌లోకి తీసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టడం ధర్మమా? ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక కదా ఇది చేయాల్సింది. మరి ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది’ అని ప్రశ్నించారు. వారు మాట్లాడిన దాంట్లో 90శాతం తప్పులే. 

 మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తన ప్యానల్ స‌భ్యులు..
‘మా’ కోసం మనమందరం

1. మంచు విష్ణు – అధ్యక్షుడు
2. రఘుబాబు – జనరల్‌ సెక్రటరీ
3. బాబు మోహన్‌ – ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
4. మాదాల రవి – వైస్‌ ప్రెసిడెంట్‌
5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి – వైస్‌ ప్రెసిడెంట్‌
6. శివబాలాజీ – కోశాధికారి
7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు
9. అర్చన
10. అశోక్‌కుమార్‌
11. గీతాసింగ్‌
12. హరినాథ్‌బాబు
13. జయవాణి
14. మలక్‌పేట్‌ శైలజ
15. మాణిక్‌
16. పూజిత
17. రాజేశ్వరీ రెడ్డి
18. సంపూర్ణేశ్‌ బాబు
19. శశాంక్‌
20. శివన్నారాయణ
21. శ్రీలక్ష్మి
22. శ్రీనివాసులు
23. స్వప్న మాధురి
24. విష్ణు బొప్పన
25. వడ్లపట్ల
26. రేఖ

Related posts