telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్ధస్త్ కి రీఎంట్రీ ఇవ్వనున్న దొరబాబు… ?

dorababu

జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు ఒకే ఒక్క పనితో తన పరువును బజారున పడేసుకున్నాడు. రీసెంట్‌గా వైజాగ్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దొరబాబు భార్య మాత్రం దొరబాబు ఏంటో నాకు తెలుసు. అతను అలాంటి తప్పు చేసి ఉండడు అంటోంది. ఏది ఏమైనా దొరబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఏది ఏమైనా ఆడియన్స్ దృష్టిలో దొరబాబు పై బ్యాడ్ రిమార్క్ పడిపోయింది. ఆ రోజు ఏదో పని మీద వైజాగ్ వచ్చిన దొరబాబు, పరదేశీని అక్కడే ఉన్న కామన్ ఫ్రెండ్ ఒకరు ఆ చోటికి తీసుకెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వ్యభిచారం జరుగుతున్న పక్క ఫ్లాట్‌లోనే కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వాళ్లు రైడింగ్‌కు వచ్చారు. అక్కడ పేకాట ఆడుతున్న వాళ్లపై రైడింగ్‌కు వస్తే.. అక్కడే ఉన్న జబర్దస్త్ కమెడియన్లు కూడా వ్యభిచారం చేస్తూ రైడింగ్‌లో పట్టుబడ్డారు. తాజాగా జరిగిన సంఘటనతో మల్లెమాల టీమ్.. దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు సమాచారం. దీంతో హైపర్ ఆది కలగజేసుకొని మల్లెమాల టీమ్‌తో మాట్లాడి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం. అతడు తెలిసి చేసాడో తెలియక చేసాడో.. ఇకపై ఎలాంటి వివాదాలకు పోనని హామి ఇస్తేనే అతన్ని తీసుకుంటామని చెప్పారట.

Related posts