telugu navyamedia
ఆరోగ్యం

ఫైల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..

ప్ర‌స్తుత జీవనశైలిలో ఆహార‌పు అల‌వాట్లు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి. దీన్ని పైల్స్ లేదా మొల‌లు, మూలశంక అని అంటారు. మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు వారిలో కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు.

పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలోనే పైల్స్ అధికంగా వస్తుంది.

ముఖ్యంగా గర్భం ధరించిన స్త్రీలలో ఎక్కువగా ఫైల్స్ సమస్య అధికంగా ఉంటుంది. వీటి నివారణకు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌తో సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా ఫైల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.. అవి ఏమిటో తెలుసుకుందాం..

12 Home Remedies for Quick Hemorrhoid Relief | Reader's Digest Canada

* మంచి ఆహారం

బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు

* మంచినీళ్లు..

నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి పైల్స్ బారిన పడే అవకాశాలు కొంత మేర‌కు తగ్గుతాయి.

*పసుపు..

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. హేమోరాయిడ్లను సృష్టించే మంటను తగ్గిస్తుంది. హేమోరాయిడ్ల ఫలితంగా ఏర్పడిన ఏదైనా పగుళ్లను నయం చేయడంలో పసుపు సహాయపడుతుంది.

* ఒకే చోట కూర్చొవ‌డం వ‌ల్ల‌..

గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.

*అల్లం ..

అల్లం ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది మరియు పైల్స్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావం ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడానికి , కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. హేమోరాయిడ్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Ginger For Piles - Effective Home Remedy to Cure hemorrhoids

* ఆముదం నూనె..

ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా నివారించే లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది. ఆముదాన్ని రాత్రి పూట తీసుకున్నా లేక మొలల ప్రాంతాల్లో రాసినా ప్రభావంతంగా పనిచేస్తుంది.

* ఇంగువ ..

మొలల సమస్య ఉన్నవారికి ఇంగువ దివ్య ఔషధం. దీనిని రోజూ తినే ఆహారంలో భగంగా చేసుకోవడం వలన జీర్ణ క్రియను తగ్గిస్తుంది. మొలల సమస్యను నివారిస్తుంది. .

*త్రిఫల చూర్ణం పొడి ..

మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఇక మళ్లీ పైల్స్ ఇక పెరగవు. మొలలపై త్రిఫల చూర్ణం అత్యంత ప్రభావం చూపిస్తుంది.

100 g Triphala / Triphala Churna Powder at best price - hbkonline.in

* బ‌య‌ట పుడ్‌..

చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి బయట దొరికే తిండి తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తగ్గించడం బెటర్.

Related posts