telugu navyamedia
సినిమా వార్తలు

రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (రౌద్రం రణం రుథిరం). పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగు చారిత్రక వీరులైన కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తుండ‌గా.. అజయ్‌ దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Watch 'RRR' Teaser: SS Rajamouli's magnum opus starring Jr. NTR, Ram Charan, Ajay Devgn, and Alia Bhatt will leave you excited

వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో వీడియోను పంచుకుంది.

Image

ఈ వీడియోలో ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇందులో భాగంగా ట్రైలర్‌లో పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చ‌ర‌ణ్‌ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ లుక్స్‌కు అభిమానుల‌కు ఆకట్టుకుంటోన్నాయి.

Image

Related posts