ఏపీ కేడర్కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది.

