telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు

ప్రైవేటు పాఠశాలలలో పుస్తకాలు మరియు స్టేషనరి అమ్మకం చట్టబద్దం – TRSMA

హై కోర్ట్ ఆదేశాల ప్రకారం నో ప్రాఫిట్ నో లాస్ (లాభ నష్టాలు లేకుండ) ప్రైవేట్ పాఠశాలలలో పుస్తకాలు మరియు స్టేషనరీ అమ్మవొచ్చు – TRSMA రాష్ట్ర అధ్యక్షలు, సాధుల మధుసూదన్ , ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మరియు కోశాధికారి రాఘవేద్ర రెడ్డి.

Sadula Madhusudhan, President
N. Ramesh Rao, Gen. Secretary
P. Raghavendra Reddy, Treasurer

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ అమ్మకూడదు, అమ్ముతే వాటిని సీజ్ చేస్తామని, పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందని ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం జారీ చేసిన GOMS No 91 ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు లో దాఖలైన WPNo 18783/2010 ఆదేశాల ప్రకారం నో ప్రాఫిట్ నోలాస్ (లాభ నష్టాలు లేకుండా) పిల్లలు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం పుస్తకాలు స్టేషనరీలు ప్రైవేట్ పాఠశాలల్లో అమ్ముకోవచ్చు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, మరియు 13.05.2015 తేదీ న కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన Rc. No. 419/D/CD/TSCERT/2010 ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు లో TRSMA దాఖలు చేసిన వ్యాజ్యం WPNo. 13339/2016 ప్రకారం ప్రైవేట్ పాఠశాల ప్రాంగణం గానీ వాటిలో విక్రయించే పుస్తకాలను, స్టేషనరీ ను సీల్ లేదా సీజ్ చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పై రెండు హై కోర్ట్ ఆదేశాల ప్రకారం నో ప్రాఫిట్ నో లాస్ (లాభ నష్టాలు లేకుండ) ప్రైవేట్ పాఠశాలలలో పుస్తకాలు మరియు స్టేషనరీ అమ్మవొచ్చు.

ఇటీవల May 27వ తేదీ న హైదరాబాద్ విద్యాశాఖాధికారి పాఠ్య పుస్తకాలు స్టేషనరీ, యూనిఫామ్, shoes లాంటివి పాఠశాలలలో అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. May 29వ తేదీన హైదరాబాద్ విద్యాశాఖాధికారికి మేము, TRSMA(తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం) DEO May 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వలు, హై కోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, కోర్ట్ ధిక్కరణ అవుతుందని వివరంగా లెటర్ ద్వారా తెలియజేసాము, ఈ విషయాన్ని TRSAMA ప్రతినిధి బృందం విద్యాశాఖ కమీషనర్ అండ్ డైరెక్టర్ గారికి తెలియజేశాము. విద్యా శాఖ సంచాలకులు, రాష్ట్రములోని అన్ని విద్యా శాఖ అధికారులకు త్విలియజేశారు.

దానికి స్పందించి DEO, హైదరాబాద్ గారు May 30వ తేదీన హైకోర్టు ఆదేశాల ప్రకారం “నో ప్రాఫిట్ నో లాస్ పద్దతిన ప్రైవేట్ పాఠశాలలలో పుస్తకాలు మరియు స్టేషనరీ విక్రయించవచ్చు” కానీ యూనిఫారం, షూస్, టై, బెల్ట్ లు అమ్మకూడదని అని రివైజ్డ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.

కానీ ఇప్పటికీ కొన్ని సామాజిక మాధ్యమాలలో, వార్తా పార్టికలలో, యూట్యూబ్ ఛానల్ ల లో, పుస్తకాలు మరియు స్టేషనరీ ప్రైవేట్ పతాహలలలో అమ్మడం నిషేధం అని చక్కర్లు కొడుతున్నాయి.

హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు లేదా ఇతరులు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కోర్ట్ ధిక్కార కేసు నమోదు చేస్తాం.

ఇట్లు

సాదుల మధుసూధన్, అధ్యక్షులు
N. రమేష్ రావు, ప్రధాన కార్యదర్శి
P. రాఘవేంద్ర రెడ్డి, కోశాధికారి

Related posts