telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ చిన్న సాయంతో సంతృప్తి… ప్లాస్మా దానం చేయాలంటూ నాని పిలుపు

Nani

కరోనా విలయతాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో జనాల్లో ప్లాస్మా దానం గురించిన అవగాహన పెంపొందేలా గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కమిషనర్‌ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సెలబ్రిటీల చేత ప్రచారం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా హీరో నాని కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లక్షలాది మందికి కోవిడ్‌ వచ్చిందని, వీరిలో చాలా మందికి తగ్గిపోయిందని, కోలుకున్నవారంతా ప్లాస్మాదానం చేయాలని ఆయన కోరారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి ఇచ్చే 500 ఎంఎల్‌ ప్లాస్మా ద్వారా ఇద్దరు కోవిడ్‌ బాధితులు కోలుకుంటారని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన ప్లాస్మా రెండు మూడు రోజుల్లో తిరిగి శరీరంలో ఫామ్ అవుతుందని చెప్పారు. ఇంత చిన్న ఎఫర్ట్ మనకు ఒక బ్యూటిఫుల్‌ ఫీలింగ్, సంతృప్తి కలిగిస్తుంది. బోలెడన్ని ప్రాణాలు కూడా కాపాడొచ్చు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న అందరూ ముందుకొచ్చి 9490617440 నెంబరుకు ఫోన్‌ చేసి ప్లాస్మా దానం చేయాలని అన్నారు నాని.

Related posts