మహారాష్ట్రలో రాజకీయం రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. మరోసారి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేపట్టింది. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం మద్దతు ప్రకటించడంతో అధికార పీఠాన్ని బీజేపీ అధిష్ఠించింది. ఈ నేపథ్యంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి మద్దతివ్వాలనే నిర్ణయం ఎన్సీపీది కాదని చెప్పారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. తమ పార్టీకి దీంతో సంబంధం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చారని తెలిపారు. అజిత్ పవార్ నిర్ణయానికి తన మద్దతు లేదని చెప్పారు.
రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!