శివసేన కేంద్ర ఒత్తిళ్ల రాజకీయాలకు భయపడదని శివసేనా నేత సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల మాట్లాడిన సంజయ్ కేంద్ర ధోరణిని తప్పుపట్టారు. దాంతో పాటుగా రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వ ఒత్తళ్ల రాజకీయాలను తెలియని వారు కాదని, బీజేపీ రాష్ట్రానికి వ్యతిరేకంగా నడుస్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలను స్వలాభాలకోసం వాడుకుంటుందని తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలపై ఒత్తిళ్ల రాజకీయాలను రుద్దేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. అందుకు ఇటువంటి చీప్ పనులను చేయడానికి కూడా వెనుకాడటంలేదు. మీరు ఎంత చేసినా మహరాష్ట్రా మీకు భయపడదు. అన్నింటిని గమనిస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ప్రతిదానికి సమాదానం చెప్పిస్తామ’ని సంజయ్ చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ఒత్తిళ్ల రాజకీయాలను ఎల్లప్పుడూ ఉంటాయని, మేము ఇప్పటికీ వాటి కారనంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని తెలిపారు. దాంతో పాటుగా ఎవరైనా ఇటువంటి రాజకీయాలు చేయాలనుకుంటే తాము వారికి స్వాగతం పలుకుతామన్నారు. మహరాష్ట్ర, దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేము కోరుకునేది పారాదర్శకమైన రాజకీయాలని కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నెగ్గేందుకు చూస్తుందని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ రెండూ ఒకటేనని సంజయ్ తెలిపారు.
previous post
next post