సాహసాన్ని సవాలుగా తీసుకున్న యువతి… అసాధ్యాన్ని సుసాధ్యంచేసింది… తెలంగాణ యువతి ఖండాంతరాలను దాటి… కీర్తిని గడించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కి చెందిన కొత్త కాపు ఆశ్రుహా ఈ ఘనతను సాధించి.. పిన వయస్సులోనే రికార్డు సృష్టించింది. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అశ్రుహా… సంగారెడ్డి జిల్లాకు నరసింహ రెడ్డి, లతల కూతురు.. . నవంబర్ 29న ప్రపంచంలోని ఏడు అత్యంత ఎత్తయిన శిఖరాలలో ఒకటైన కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించి రికార్డు నమోదుచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని శిఖరాగ్రానికి చేరుకుంది.
ప్రొఫెషనల్ పర్వతారోహకుల సహాయంతో ఈ ప్రయాణం సాగింది. ఐదుగురితో సాగిన ఈ ప్రయాణంలో.. చివరకు ముగ్గురు మాత్రమే అధిరోహాంచారు. ఐదు రోజుల కష్టతరమైన ట్రెక్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా కోచ్ ద్రోణ చార్య అవార్డ్ గ్రహీత నాగపురి రమేష్ శిక్షణ సహాయంతో.. ప్రత్యేక శిక్షణతో పూర్తిచేసింది.
ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం అయిన కిలిమంజారోను అధిరోహించడానికి అశ్రుహా నాలుగు నెలలు కఠిన శిక్షపొందింది. హైదరాబాద్ నుంచి టాంజానియా వెళ్లిన అశ్రుహా.. బలమైన చల్ల గాలులను, ఎముకలు కొరికే చలి (-15 డిగ్రీ సెల్సియస్), దట్టమైన మంచు పొగ కఠిన వాతావరణాన్ని తట్టుకుంటూ ముందుకెళ్లింది. శిఖరాన్ని చేరుకునేందుకు అశ్రు ఏకధాటిగా 16 గంటల పాటు నడిచింది. ప్రతికూల వాతవారణంలో గడ్డకట్టే చలిలో 5,895 మీటర్ల వరకూ ప్రయాణం చేసింది.
సంకల్పంతో సాధించనిది ఏదీ లేదని అశ్రుహా నిరూపించిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేశారు. పర్వతారోహణకు తల్లిదండ్రుల ప్రోత్సహమే పునాదిలాంటిదని అశ్రుహా చెబుతోంది. పట్టుదల… లక్ష్యం సాధించాలనే తపనతో దేన్నైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని అశ్రుహాలో వ్యక్తమవుతోంది.