బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన సరికొత్త డైలాగుతో వరల్డ్ రికార్డును సృష్టించారు. తన తాజా చిత్రం “కొబ్బరిమట్ట”లో ఏకంగా మూడున్నర నిమిషాల డైలాగ్ ను ఏకబిగన చెప్పి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా.. ఇంకొకటి ఆండ్రాయిడు. ఇప్పటికే పాపారాయుడు, పెదరాయుడు పాత్రలను పరిచయం చేశారు. తాజాగా.. ఆండ్రాయుడును ఇంట్రడ్యూస్ చేస్తూ… మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పారట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్ రిలీజైంది. సంపూ డైలాగ్ చెబుతున్నప్పుడు టైమర్‌ను కూడా స్క్రీన్‌పై రన్ చేశారు. కరెక్ట్‌గా 3.27 నిమిషాల డైలాగ్. ఈ సినిమా డైలాగ్.. దానవీర శూరకర్ణలోని మయ సభ సీను డైలాగ్ కు పేరడీగా ఉండటం విశేషం. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలం సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక దానవీరశూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ “ఆచార్య దేవా.. ఏమంటివి..ఏమంటివి..”కి అప్పట్లో జనం నీరాజనాలు పలికారు. ఇప్పటికి చాలామంది స్టార్లు ఎన్టీఆర్ డైలాగును తమ స్టయిల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవల తమిళ హీరో ధనుష్ కూడా రఘువరన్ బీటెక్ సినిమాలో బీటెక్ స్టూడెంట్ కష్టాలను ఓ సుదీర్ఘమైన డైలాగును ఏకబిగిన చెప్పి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


“సైరా”తో “వార్”… చిరంజీవిపై హృతిక్ వ్యాఖ్యలు