telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరంలో చంద్రబాబు ప్రారంభించిన స్పిల్ వే గేటు తొలగింపు!

పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పిల్ వేలో భాగంగా గత సంవత్సరం చంద్రబాబు ఓ గేటును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నర క్రితం చంద్రబాబు పెట్టించిన స్పిల్ వే గేటును అధికారులు తొలగించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లను అమర్చాల్సి వుంది.

బెకమ్ కంపెనీ ఇప్పటికే ఈ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను పూర్తి చేసింది. పిల్లర్ల పనులు ప్రారంభమైతే వీటిని బిగించే పనులు మొదలవుతాయి. కాగా, గోదావరికి వరదలు వచ్చే సమయం కాబట్టి, వరద ఉద్ధృతి పెరిగితే, స్పిల్‌ వే పైనుంచి నీటిని మళ్లిస్తామని, అందుకే గేటును తొలగించామని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, ఈ సంవత్సరం గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts