telugu navyamedia
సినిమా వార్తలు

“7” చిత్రం నుంచి “సంపొద్దే నన్ను” లిరికల్ వీడియో

7

హవీష్, రెజీనా కాసాండ్రా, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “7”. ఈ చిత్రానికి నిజార్ షఫీ దర్శకత్వం వహిస్తుండగా రమేష్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “ఆర్ఎక్స్ 100” చిత్రానికి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రెహమాన్, అదితి ఆర్య, అనిషా అంబ్రోస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “సంపొద్దే నన్ను…” అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. శుభం విశ్వనాథ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా మధుర శ్రీ గుండెకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియోను వీక్షించండి.

Related posts