telugu navyamedia
సినిమా వార్తలు

నాని వల్ల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి : దిల్ రాజు

Jersey

నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా న‌టించిన సినిమా “జెర్సీ”. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకెల్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా చూసిన ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు హైద‌రాబాద్‌లో సోమ‌వారం సాయంత్రం అభినందన సభను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ “ఏప్రిల్‌ 19న నేను డబుల్‌ పాజిటివ్‌ చూశా. డైలాగులు వినిపించకపోతే నాని చెబుతున్నాడు. అయితే… భార్యాభర్తల మధ్య డైలాగులు లేకుండా దర్శకుడు భావోద్వేగాలను చూపించిన తీరు అద్భుతం. ఒక్క సినిమా అనుభవంతో అతను ఇలాంటి సినిమా తీయడం గ్రేట్‌. సక్సెస్‌లో ఫస్ట్‌ క్రెడిట్‌ అతడిదే. నెక్ట్స్‌… నాని. సినిమాలు ఆడినా, ఆడకున్నా వాటిలో నాని కనిపిస్తాడు. ఆడే సినిమాలో నాని ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి… ఈ సినిమాకు నాని పారితోషికం వద్దన్నాడనీ, లాభాల్లో వాటా ఇవ్వమన్నాడనీ నిర్మాత చెప్పగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హీరో అలా ముందుకు వస్తే గానీ ఇలాంటి సినిమాలు రావు. ఇక సినిమాకు వెన్నెముకగా నిలిచిన నిర్మాతలకు అభినందనలు. ఇలాగే డబ్బులు వచ్చే మంచి సినిమాలు వంశీ తీయాలని కోరుకుంటున్నా అన్నారు.

నాని మాట్లాడుతూ “నా ప్రతి సినిమా చూశాక… ఐదేళ్ళ తర్వాత చూస్తే పాతబడుతుందా? అని ఆలోచిస్తా. “జెర్సీ” మాత్రం ఎప్పటికీ పాతబడదని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. హీరో, దర్శకుడు నమ్మకంతో ఇలాంటి సినిమా తీయాలని ముందుకు వెళ్ళొచ్చు. నిర్మాతలు వ్యాపారకోణంలో ఆలోచిస్తారు కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు. కానీ వంశీ చాలా నమ్మాడు. మా యూనిట్‌ అందరూ కష్టపడ్డారు”అన్నారు.

ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ “ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాని కాన్ఫిడెన్స్‌ చూసి… ఆయన నాపై ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారా అని టెన్షన్‌ పడ్డా. విడుదల రోజు సాయంత్రానికి టెన్షన్‌ తీరింది” అని అన్నారు.

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “నేను చేసింది రెండు సీన్లు. అందులో ఓ మంచి సీను డైర‌క్ట‌ర్‌గారు తీసేశారు. ఒక్క మంచి సీన్ మాత్రం ఉంచారు. అదృష్టంగా భావిస్తున్నా. స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేస్తారు. కానీ నాని గ‌త సినిమా పోయినా చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. పాత్ బ్రేకింగ్ అనేది లైఫ్ రిస్కు చేస్తేనే వ‌స్తుంది. త‌ను ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చేయ‌డానికి ముందు త‌ను ఏం ఫీలై చేశాడ‌నేది నాకు ఆశ్చ‌ర్యంగా అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా బాగా చేశారు. గౌత‌మ్‌లాంటి వాళ్లు క‌రెప్ట్ కాకుండా, ఇలాంటి సినిమాలు చేయాలి. వేస‌విలో వ‌చ్చిన సినిమాల‌న్నీ సెన్సిబుల్ సినిమాలే. నాకు మొనాటిన‌స్ పెరిగిన‌ప్పుడు నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి యాక్ట్ చేస్తే డీటాక్స్ అయిన‌ట్టు అనిపిస్తుంది” అని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో దిల్ రాజు, నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, శ్రద్ధా శ్రీనాథ్‌, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, కెకె తదితరులు పాల్గొన్నారు.

Related posts