telugu navyamedia
సినిమా వార్తలు

ప్రకాశ్ రాజ్ దమ్మున్నవాడు..

మా ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. వ‌రుస మీడియా సమావేశాల.. విమర్శలు, ఆరోపణలతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు మేమంతా ఒక్కటే అన్నట్లుగా ఉన్న సినీ పరిశ్రమలో ఇప్పుడు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకుంటున్నారు. ఇ ప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఫిర్యాదులు ఇండస్ట్రీలో వేడిపుట్టించ‌గా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు మ‌రింత హీట్ పెంచాయి.

మా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని సినీ నటుడు నాగబాబు ఆరోపించారు. బుధవారం ఆయన ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రకాశ్‌రాజ్‌ భారతీయనటుడని, ఆయన తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటరని ప్రశ్నించారు. 

Prakash Raj takes on Vishnu Manchu in direct fight for MAA president - Social News XYZ

మనది చిన్న అసోసియేషన్‌.. ఒకే వ్యక్తి ఉన్న బ్యాడ్‌ హ్యబిట్‌ వల్ల జనంలోకి వెళ్లవలసి వచ్చింది. తుమ్మతే, దగ్గితే ప్రెస్‌ మీట్‌ అంటున్నారు. నరేశ్‌ ప్రెండ్‌ అయిన ఏది మాట్లాడితే అది మాట్లాడితే బాగుండదు.. నేను బిజెపి సానుభూతిపరున్ని.. ప్రకాశ్‌రాజ్‌ కమ్యూనిస్ట్‌ భావజాలం కలిగి ఉన్నవాడు.. గ్రేటిస్ట్‌ ఆర్టిస్ట్.. దేశం గర్వించదగిన నటుడు అంటూ చెప్పుకొచ్చారు. నా కన్న ఎక్కువగా మా అన్నయ్య చిరంజీవికి క్లోజ్‌… మా అన్నయ్య క్లోజ్‌ అయిన వ్యక్తి నాకు క్లోజ్‌.. మా అన్నయ్య చిరంజీవి మా ఎన్నికల్లో నువ్వు ఎవరికైనా మాట ఇచ్చావా అన్నాడు లేదు అని చెప్పాను.. ప్రకాశ్‌ రాజ్‌ వస్తున్నాడు మద్దతు ఇవ్వన్నాడు.. అనుభవజ్ఞుడు, తెలివైన వాడు వస్తానంటే స్వాగతించాను.

“ప్రకాశ్‌రాజ్‌ కూరలో ఉప్పులాంటి వారు. ఆయన చిన్న సినిమా వాళ్లకు, పెద్ద సినిమా వాళ్లకూ కావాలి. నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాశ్‌రాజ్‌ను అందరూ ఒప్పుకోవాల్సిందే! ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తారని అస్సలు ఊహించలేదు. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్‌రాజ్. అంత మొత్తాన్ని వదులకుని ‘మా’ కోసం పనిచేయడానికి వచ్చారు.

ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌లాంటివాళ్లు ‘ప్రకాశ్‌రాజ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అంటే అంత చులకనా? కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా? ‘మా’ అసోసియేషన్‌కు సేవ చేస్తానని వస్తానంటే కించపరుస్తారా? ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు.

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు.. | Maa elections 2021 nagababu shocking comments on maa elections and manchu vishnu panal ...

గతంలో మా అసోసియేషన్ మాసకబారిపోయింది అన్నాను.. కానీ ఇప్పుడు మా మాసకబారబోతుంది.. మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. కానీ మీరు అలాంటి ప్రలోభాలకు లొంగిపోకండి.. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. మా అసోసియేషన్ సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దు” అని నాగబాబు పిలుపునిచ్చారు.

ప్రకాష్ రాజ్ లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు.. ప్రకాష్ రెండు సంవత్సరాలు కాదు.. మూడు తరాలకు ఉంటే గానీ.. మా అసోసియేషన్ పోజిషన్ టాప్ లెవల్ కు వెళ్లదన్నారు నాగబాబు.. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ దమ్మున్నవాడని తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు.

Related posts