అక్కినేని హీరో, కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నెట్టింట్లో అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇదే క్రమంలో అక్కినేని కోడలు సమంత కూడా ట్విట్టర్ వేదికగా నాగార్జునకు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను …హ్యాపీ బర్త్‌డే మామ” అంటూ సమంత ట్వీట్ చేశారు.

కాగా..అక్కినేని కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి అంటూ వస్తున్న వార్తలకు సామ్ తన ట్వీట్‌తో చెక్ పెట్టింది. గత కొద్ది రోజులుగా నాగచైతన్యకు, సమంతకు పడడం లేదని.. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తున్నాయని, తన సోషల్ మీడియా అకౌంట్లలో సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించడమే అందుకు కారణం అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్క ట్వీట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టింది సామ్..

ఇకపోతే.. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆమె పాత్రకి సంబంధించిన చిత్రీకరణ ముగించి తమిళ మల్టీస్టారర్ ‘కాతువాకుల రెండు కాదల్’ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఇందులో విజయ్ సేతుపతి, నయనతార ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.



థ్యాంక్స్ టు కరోనా వైరస్ స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం… హీరో నిఖిల్ కామెంట్