టాలీవుడ్ లో అటు యాంకర్ గా, ఇటు నటిగా రాణిస్తున్న అనసూయకు క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో కథనం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకుడు. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెన్నెల కిషోర్, ధనరాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం “కథనం” చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ డబ్బింగ్ చెబుతున్న ఫన్నీ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందిస్.
ఈ వీడియోలో వెన్నెల కిషోర్ తనదైన శైలిలో జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. ముఖ్యంగా “రాజమౌళికి బాహుబలి హిట్ ఎలా పడిందో తెలుసా? కాలుతున్న దోసె మీద నెయ్యి వేసి రోస్ట్ చేస్తే.. కొడదాం.. గట్టిగా కొడదాం” అంటూ వెన్నెల కిషోర్ చెబుతున్న డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రోషన్ సాలూరు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సంగీతం సమకూరుస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.
Hilarious @vennelakishore dubbing for #Kathanam
Starring @anusuyakhasba #AvarasaralaSrinivas @DhanrajOffl#RajeshNadendla #SharmaChukka #BattepatiNarendraReddy @MangoMusicLabel
Release date will be unveiled soon pic.twitter.com/qV1rVxwcpl
— BARaju (@baraju_SuperHit) June 11, 2019
నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..