ప్రస్తుతం అగ్ర నటులు ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. ఇది కేవలం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఫాలో అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఆదిపురుష్ సినిమాలో హీరోగా ప్రభాస్ చేస్తున్నాడు. అంతే అందులో రావణుడి పాత్రగా బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సైఫ్ ఓ వెబ్ సిరీస్‌లో కూడా చేశాడు. దాని పేరు తండవ్. ఇది ఓ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ చేయనుంది. ఇటీవల దీనికి సంబందించిన టీజర్‌ను విడుదల చేసింది. అందులో సైఫ్ అలీ ఖాన్ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. ఇండియాలో ప్రస్తుతం రాజకీయం నడుస్తోందని, ప్రధాని ఎవరైతే వారే రాజు. ప్రధాన మంత్రి పదవి కోసం ఏం చేసేందుకైనా సిద్దంగా ఉండాలన్నట్లుగా టీజర్ కథా నేపథ్యంలో టీజర్ ఉంది. ఈ టీజర్‌లో సైఫ్ ఎంతో పవర్‌ఫుల్‌గానే కాకుండా స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. తండవ్ వచ్చే ఏడాది మొదట్లో అంటే జనవరీ 15న విడుదల అవ్వనుంది.
previous post
next post