మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్ డే విషెస్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు.
”నా ప్రియమైన వైషు బాబు హ్యాపీ బర్త్ డే. గత ఏడాది నీ డెబ్యూ చిత్రం విజయం సాధించడంతో చాలా సంతోషాన్నిచ్చింది. ఇక ఏడాది చివర్లో నువ్వు మన ఫ్యామిలీ అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను ఆసుపత్రి బెడ్ పై నువ్వు చూడాల్సి రావడం బాధాకరమే.

నువ్వు అన్నయ్య అని పిలిచినా నేను లేచే పరిస్థితిలో లేను. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బాధని దిగమింగుతూనే స్ట్రాంగ్ గా నిలబడ్డావు. నేను కోలుకుని ఇంటికి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూశాను. నేను నిన్ను చూసి గర్వపడుతున్నా లిటిల్ బ్రదర్ ..’ ఇలానే నువ్వు సంతోషంగా, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ” అని పేర్కొన్నారు సాయి తేజ్.

కాగా..గత ఏడాది హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ సమీపాన బైక్ స్కిడ్ కావడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో సాయి తేజ్ కోమాలోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో దాదాపు 3 నెలలకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. అయితే హాస్పిటల్‌లో సాయి తేజ్ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకున్నారు ఆయన తమ్ముడు, హీరో వైష్ణవ్ తేజ్. అన్నపై ప్రేమతో సేవ చేశారు. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు సాయి ధరమ్ తేజ్.

