భారత క్రికెట్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ఎప్పుడు గుర్తు పెట్టుకునే క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే తన కెరీర్లో ఎన్ని అద్భుతమైన రికార్డులు సాధించిన ఆ అత్యంత ముఖ్యమైన రికార్డుకు సాధించి నేటికి 9 ఏళ్లు పూర్తవుతోంది. 2012లో ఇదే రోజున సచిన్.. తన 100వ సెంచరీ సాధించాడు. సెంచరీ సెంచరీలు చేసి క్రికెట్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ పై 114 పరుగులు చేసిన ఈ ఘనతను అందుకున్నాడు. అందుకే మార్చి 16.. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఆసియా కప్-2012లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సెంచరీ సచిన్‌కు వన్డేల్లో 49వది. అలాగే అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేయడం వల్ల ప్రపంచ క్రికెట్లో 100 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. సచిన్ కెరీర్లో మొత్తం 164 అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితాలో 71 శతకాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలవగా.. కోహ్లీ 70 సెంచరీలతో ఉన్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					


జగన్ పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు…