దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇది సాధారణ విషయం కాదని, పవర్ గ్రిడ్‌పై ప్రమాదకర ప్రభావం పడుతుందని అన్నారు. ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలుగుతుందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ హెచ్చరించారు.
ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్ చేస్తే విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిపై మంత్రి నితిన్ రౌత్ వివరంగా మాట్లాడుతూ… ‘అన్ని లైట్లను ఆపేస్తే అది గ్రిడ్ వైఫల్యానికి దారి తీయొచ్చు. అన్ని అత్యవసర సేవలు నిలిచిపోతాయి, మళ్లీ పవర్ రీస్టోర్ చేయాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని తెలిపారు. రోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగడం చాలా ముఖ్యమని చెప్పారు.