ఈ నెల 25న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని మైదానంలో ఆర్ఎస్ఎస్ సభ జరిగింది. ఈ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. సభలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఫిర్యాదు చేశారు.
దేశంలోని 130 కోట్ల మంది హిందువులేనన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఈ మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇతరమతాల వారి మనోభావాలను కించపరిచారని వీహెచ్ ఆరోపించారు.
ఇక నుండి కర్ణాటకలో కొత్త తరహ అభివృద్ది: బీజేపీ నేత యడ్యూరప్ప