ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ట్రక్కుపైకి దూసుకుపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా వద్ద తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
previous post


నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్