telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ…

tirumala luddu

కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు. ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. రోజు వారి టోకెన్‌ ప్రకారమే శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సర్వదర్శనం టోకెన్‌లను పదివేల నుంచి ఏకంగా 20వేలకు టీటీడీ పెంచింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూదేవి కాంప్లెక్స్‌లో ఈ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. టికెట్లను పొందేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని, మాస్క్‌ ధరించి రావాలని, చేతులను శానిటైజ్‌ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా.. నిన్న శ్రీవారిని 47 వేల 900 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19320 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే మూడు కోట్లుగా తేలింది.

Related posts