telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా నియమించాలి..”మహా” కేబినేట్ మరోసారి తీర్మానం

uddhav-thackeray-shivasena

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానంలో నియమించాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం రెండోసారి తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని నిన్న రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి పంపినట్టు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నియమించాలంటూ ఈ నెల 9న తొలిసారి తీర్మానం చేసి, మంత్రివర్గం దానిని గవర్నర్‌కు పంపింది.

గవర్నర్ తీర్మానాన్ని ఆమోదించకపోవడంతో తాజాగా రెండోసారి తీర్మానం చేసి పంపారు. అయితే, ఈసారైనా గవర్నర్ ఆమోదిస్తారా! అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మే 28కి ఆరు నెలలు పూర్తవుతుంది. ఆ లోపు ఉద్ధవ్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకుంటే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. 

Related posts